ఆ విషయంలో విశ్వక్‌ను మెచ్చుకోవాల్సిందే!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిగిలిన హీరోల్లా కాకుండా విశ్వక్ పలు టాలెంట్స్ తో ముందుకెళ్తున్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు రచన, నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాడు. రీసెంట్ గా గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విశ్వక్ ఆ సినిమా కోసం ఐదేళ్లకు పైగా కష్టపడ్డాడు.
మానవ స్పర్శ తట్టుకోలేని అఘోరాగా శంకర్ పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు. విశ్వక్ ఇప్పటివరకు చేసిన ప్రతీ సినిమా ఓ ప్రయోగమే. అందుకే తన మార్కెట్ ఎలా ఉన్నా హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా వెళ్తున్నాడు. విశ్వక్ మొదటి సినిమా ఫలక్ నామా దాస్ నుంచి గామి వరకు ప్రతీ సినిమా ఒక ప్రయోగమే.
ఆ సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా ఇలాంటి కొత్త ప్రయోగాలు చేస్తున్నందుకు విశ్వక్ ను తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. ఇదిలా ఉంటే విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. గోదావరి నేపథ్యంలో విలేజ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తుంది. ఇది కాకుండా విశ్వక్ చేతిలో మరో రెండు సినిమాలున్నాయి.













