విశ్వక్ ప్రశ్నకు మూగబోయిన సూర్య
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్(Viswaksen) స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్నాడంటే ఏదొక విధంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవడం ఖాయం. మీడియాను ఎట్రాక్ట్ చేసేలా కామెంట్స్ చేయడం తనకు అలవాటు. ఈ విధంగానే తన సినిమాలను కూడా ప్రమోట్ చేస్తూ ఉంటాడు విశ్వక్(Viswak). తాజాగా విశ్వక్సేన్ కంగువ(Kanguva) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యాడు.
ఈ ఈవెంట్ కు రాజమౌళి(Rajamouli) తో పాటూ ఎంతో మంది గెస్టులు హాజరయ్యారు. అయితే అంతమందిలో రాజమౌళి తర్వాత హైలైట్ అయింది విశ్వక్నే. తన స్పీచ్ లో భాగంగా సూర్య(Suriya)ను విశ్వక్ సరదాగా ఓ ప్రశ్న అడిగి నవ్వులు పూయించాడు. సింగం2(Singam2)లో ఓ సీన్ లో విలన్ ఇల్లు ఎక్కడ అని సూర్య ఓ మిడిల్ ఏజ్ అతణ్ని అడుగుతాడు. దానికి ఆయన ఏమో తెలీదంటాడు. ఆవేశంలో ఉన్న సూర్య అతణ్ని కొడతాడు.
ఆ వీడియో ప్లే చేయించి పాపం అడ్రస్ తెలియదని చెప్పినందుకు అతణ్నెందుకు కొట్టారు సార్ అని సూర్యను విశ్వక్ అడిగాడు. మీ లాంటి మంచి వాళ్లు అలా ఎందుకు కొట్టారా అని తెలుసుకోవాలని తెలుగు ఆడియన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారన్నాడు. దానికి సూర్య పొట్ట చెక్కలయ్యేలా నవ్వి డైరెక్టర్ హరి(Hari Director)ని అడిగి తెలుసుకుని చెప్తానని చెప్పాడు. అయితే విశ్వక్ తన స్పీచ్ లో భాగంగా తాను సూర్యకు చాలా పెద్ద ఫ్యాన్ అని, అప్పట్లో గజినీ(Gajini) సినిమా చూసి తాను కూడా గుండు కొట్టించుకున్నానని తెలిపాడు. విశ్వక్ మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













