మెకానిక్ రాకీ ట్రైలర్ టాక్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్(Viswaksen) వరుసపెట్టి సినిమాలైతే చేయగలుగుతున్నాడు కానీ విజయాలు మాత్రం ఆ స్థాయిలో అందుకోలేకపోతున్నాడు. విశ్వక్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ధమ్కీ(Dhamki), గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari) ఫ్యాన్స్ ను నిరాశ పరిచాయి. గామి(Gaami) సినిమాకు మంచి టాక్ వచ్చింది కానీ బ్లాక్ బస్టర్ కాలేదు. ఇప్పుడు విశ్వక్ నుంచి వచ్చే నెల 22న మెకానిక్ రాకీ(Mechanic Rockey) సినిమా రానుంది.
ఎం. రవితేజ(M ravi teja) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఆడియన్స్ కు ఈ మూవీ కొత్త అనుభూతినిస్తుందని విశ్వక్ సేన్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి కాన్సెప్ట్ చెప్పేశారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫెయిల్ అయిన విశ్వక్ తన తండ్రి నరేష్(naresh) నడిపే మెకానిక్ షెడ్ బాధ్యతలు తీసుకుంటాడు.
నచ్చిన అమ్మాయి వెంట పడే అలవాటున్న విశ్వక్ లైఫ్ లోకి ఇద్దరమ్మాలొస్తారు. కట్ చేస్తే విలన్ సునీల్(Suneel) వల్ల విశ్వక్ వ్యాపారానికి నష్టంతో పాటూ ఫ్యామిలీ కూడా రిస్క్ లో పడుతుంది. దీనికి రాకీ ఏం చేశాడనేదే సినిమా కథగా తెలుస్తోంది. రిలీజ్ డేకు ముందు రోజు అంటే నవంబర్ 21 నుంచే ప్రీమియర్లు వేస్తామని, ఎవరైనా నచ్చలేదని చెప్తే రిలీజ్ రోజు థియేటర్లకు రావొద్దని విశ్వక్ ఛాలెంజ్ చేశాడు. చూస్తుంటే మెకానిక్ రాకీపై విశ్వక్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.













