యావరేజ్ టాక్‌తోనే కలెక్షన్ల వర్షం
విశ్వక్ సేన్. ఈ జనరేజన్ కుర్రాళ్లకు ధీటుగా కనిపిస్తాడు. చిన్న వయసులోనే హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా పేరు సంపాదించిన విశ్వక్‌కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో, యాంటి ఫ్యాన్స్ కూడా అంతే ఉన్నారు. తన సినిమాల గురించి విశ్వక్ ఓవర్ హైప్ చేసి చెప్పుకోవడం, ఫంక్షన్లలో తను చేసే కామెంట్ల వల్ల విశ్వక్ కు ఆ యాంటీ ఫ్యాన్స్ వచ్చారు.
అయితే విశ్వక్ అంటే నచ్చినా నచ్చకపోయినా, తన సినిమాలకు, తనను మాత్రం జనాలు వదలట్లేదు. తనకుంటూ ఒక ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. అందుకే తన సినిమాలకు టాక్ ఎలా ఉన్నా దాన్ని పట్టించుకోకుండా మంచి ఓపెన్సింగ్ని ఇస్తారు ప్రేక్షకులు. యూత్‌లో విశ్వక్ కు ఉన్న క్రేజే అందుకు కారణం.
రీసెంట్గా రిలీజ్ అయిన విశ్వక్ కొత్త సినిమా దాస్ కా ధమ్కీ కు అసలు మంచి టాక్ రాలేదు. అన్‌సీజన్‌లో మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమాతో పాటూ రిలీజ్ అయిన రంగమార్తాండకు మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోతుంది. కానీ యావరేజ్ టాక్ వచ్చిన ధమ్కీ మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తోంది.
ఫస్ట్ డే రూ.8 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసింది ధమ్కీ. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా రూ.15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని టాక్. విశ్వక్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాతో తన మార్కెట్ బాగా పెరిగిందని చెప్పాలి. యూఎస్‌లో కూడా ఈ సినిమా 2 లక్షల డాలర్ల మార్క్‌కు దగ్గరలో ఉంది. చూస్తుంటే ఫుల్ రన్లో దాస్ కా ధమ్కీ సూపర్ హిట్ స్థాయిని అందుకుంటుందేమో అనిపిస్తుంది.













