విశ్వక్ వాయిదా వేసి మంచి పని చేశాడు
అన్నీ అనుకున్నట్టు అయి ఉంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇవాళ రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ తో పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా లేటవడం, విశ్వక్ గాయపడటం వల్ల ఈ సినిమాను నెక్ట్స్ ఇయర్ మార్చి 8న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తాజా పరిస్థితులు చూస్తుంటే విశ్వక్ టీమ్ తీసుకున్న నిర్ణయం చాలా కరెక్టని భావిస్తున్నారంతా.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల వల్ల ఏర్పడిన వాతావరణంతో ఆడియన్స్ బయటకు రాలేకపోతున్నారు. నిన్న రిలీజైన హాయ్ నాన్న ఓపెనింగ్సే ఇందుకు సాక్ష్యం. టాక్ పరంగా బాగున్నా హాయ్ నాన్నకు పెద్దగా టికెట్స్ అమ్ముడు పోలేదు. మెయిన్ సెంటర్స్ తప్ప మిగిలిన అన్ని చోట్లా బుకింగ్స్ వీక్ గానే ఉన్నాయి. ఇవాళ నుంచి ఎట్టి పరిస్థితుల్లో హాయ్ నాన్న బుకింగ్స్ పికప్ కావాల్సి ఉంది.
ఇలాంటి టైమ్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాయిదా పడటమే బెటరని అందరూ ఫీలవుతున్నారు. దానికి తోడు యానిమల్ ఫీవర్ లో ఉన్న యువత వేరే సినిమాలను అంతగా పట్టించుకోవడం లేదు. దాస్ కా ధమ్కీ తో ఫ్లాప్ అందుకున్న విశ్వక్ కు ఆశలన్నీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపైనే ఉన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి మేకోవర్ కూడా చేశాడు. టైమ్ దొరికింది కాబట్టి ఈ సారి సినిమాకు ప్రమోషన్స్ ను కూడా నిర్మాణ సంస్థ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.













