విశ్వక్ సైలెన్స్‌కు కారణమేంటి?
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ విషయంపై హీరో విశ్వక్సేన్ గత కొన్ని వారాల ముందు తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ 8న రిలీజ్ చేయాలనుకుని ముందుగానే అనుకున్నారు. కానీ సలార్ సినిమా వల్ల క్రిస్మస్ కు షెడ్యూల్ అయిన సినిమాలన్నీ ప్రీ పోన్ అయ్యి డిసెంబర్ రెండో వారానికి షెడ్యూల్ అయ్యాయి.
డిసెంబర్ రెండో వారంలో వరుణ్ తేజ ఆపరేషన్ వాలెంటైన్ ఉంది. దాంతో పాటూ నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ట్రా మూవీలు కూడా డిసెంబర్ రెండో వారానికే వచ్చాయి. దీంతో ఒక్క సినిమానైనా పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటినీ చూసిన విశ్వక్, బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం వల్లే తొక్కేస్తున్నారని, డేట్ మారిస్తే ప్రమోషన్లకు రానని విశ్వక్ పోస్ట్ చేశాడు.
అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి ప్రస్తుతం ఎలాంటి సౌండ్ లేకపోవడంతో సినిమా పోస్ట్‌పోన్ అయిందని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ సినిమా రిలీజ్ ఉంటే ఈపాటికే ప్రమోషన్స్ చేసేవారు. కానీ ఇప్పటివరకు అలాంటివేమీ జరగడం లేదు మరోవైపు ఒకవేళ రిలీజ్ ఉన్నా ప్రమోషన్స్ కు విశ్వక్ సపోర్ట్ చేయడం లేదా అని మరికొందరంటున్నారు.













