బాలయ్య దారిలో వెళ్తున్న విశ్వక్
అఘోర క్యారెక్టర్ చేసి టాలీవుడ్ లో చాలా మంది కమర్షియల్ గా నష్టపోయారు. గతంలో ఈ ప్రయోగాలు చేసి చాలా మంది హీరోలు చేతులు కాల్చుకున్నారు. 30 ఏళ్ల కిందట రాజేంద్ర ప్రసాద్ కాష్మోరాలో మంచి నటన కనబరిచినా ఆ సినిమాను జనం ఆదరించలేదు. శ్రీ మంజునాథలో చిరూ కాసేపు గెటప్ వేస్తే ఆ సినిమా కూడా కమర్షియల్ గా వర్కవుట్ అవలేదు.
ఈ ట్రెండ్ ను నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాలో అఘోరా పాత్రలో కనిపించి బ్రేక్ చేశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడు బాలయ్య దారిలోనే టాలీవుడ్ యంగ్ నటుడు విశ్వక్సేన్ కూడా వెళ్తున్నాడు. విశ్వక్సేన్ గామి అనే సినిమాలో అఘోరాగా నటించాడు. సుమార్ ఐదేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్కు రెడీ అవుతోంది.
విద్యాధర్ కగిత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్నో షాకింగ్ అంశాలుంటాయంటున్నారు. మార్చి 8న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కాకపోతే ఈ సినిమాను తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యువి క్రియేషన్స్ ఈ సినిమా సమర్ఫణ బాధ్యతలు తీసుకుంది. ఒకవేళ చెప్పిన టైమ్ కు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వస్తే గామి సమ్మర్ రిలీజ్ కు వెళ్లనుంది. గామి కోసం విశ్వక్సేన్ ఎంతగానో కష్టపడ్డాడని, ఈ సినిమాలో విశ్వక్ కష్టం ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.













