విశాల్ పెళ్లి చేసుకునేది ఈ అమ్మాయినే
సినీ హీరో విశాల్ అతి త్వరలోనే పెళ్లి పీటలు వెక్కనున్నారు. విశాల్ తండ్రి జీకే ఇప్పటికే ఈ విషయాన్ని సృష్టం చేయగా.. తాజాగా విశాల్ సైతం తాను పెళ్లి చేసుకోబోతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నాడు. ఇదే అంశాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. అవును నేను పెండ్లీ చేసుకోబోతున్న. చాలా సంతోషంగా ఉన్నా. అమ్మాయి పేరు అనీషా అని తెలిపారు. త్వరలోనే వివాహా తేదీలను తెలియజేస్తానన్నారు. అనీషా విషయానికి వస్తే… హైదరాబాద్ బిజినెస్మేన్ విజయ్ రెడ్డి, పద్మజల కుమార్తె అయిన ఆమె.. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు వంటి చిత్రాల్లో నటించారు. అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె కీర్తి పాత్రని పోషించారు. ఇకపై ఆమె సినిమాల్లో కొనసాగే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది.













