విశాల్ కొత్త సినిమా షురూ…
విశాల్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియన్ మూవీ ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది. ఎ.వినోద్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సునైన హీరోయిన్. రానా ప్రొడక్షన్స్ పతాకంపై రమణ, నంద నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. సమాజంలో ఓ మంచి మార్పు తీసుకురావడానికి కారణం అయ్యే ఓ అంశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమాకు అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉంటుంది. విశాల్ ఇప్పటి వరకు చాలా యాక్షన్ సినిమాలు చేశారు. కానీ ఈ సినిమాలో నెక్టస్ లెవల్ యాక్షన్ సీక్వెన్సెస్‌ను చూస్తారు. ముఖ్యంగా సెకండాప్లో దాదాపు 45 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. దిలీప్ సుబ్బరాయన్ స్టంట్స్ సమకూర్చుతున్నారు అని చిత్రయూనిట్ పేర్కొంది ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాలగోపి.













