విశాల్ బర్త్ డే సందర్భంగా.. ‘సామాన్యుడు’ ఫస్ట్ లుక్ విడుదల
విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి సమాన్యుడు అనే టైటిల్ని ఖరారు చేశారు. నాట్ ఎ కామన్ మ్యాన్ అనేది ఉపశీర్షిక. ఆగస్టు 29న విశాల్ బర్త్ డే సందర్భంగా సామాన్యుడు టైటిల్, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. విశాల్ నటించిన పలు సినిమాలకు సంగీతం అందించిన యువన్ శంకర్ రాజా సామాన్యుడు కి కూడా సంగీతం అందిస్తున్నారు. కవిన్ రాజ్ మంచి విజువల్స్ ఇస్తున్నారు. తు.ప శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో థియేటర్స్లో విడుదల చేస్తాం అని చిత్ర యూనిట్ పేర్కొంది.













