రజనీకాంత్ తరపున ప్రచారం చేస్తా
రజనీకాంత్ ఓ రాజకీయ నాయకుడిగా ప్రజలకు మంచి చేస్తారన్న నమ్మకం తనకు ఉందని హీరో విశాల్ అన్నారు. రాజకీయ రంగం ప్రజలకు సేవ చేయడానికి ఉంది. ఇందులోకి ఎవరైనా రావొచ్చు. తమిళనాడు ప్రజల కోసం రజనీ మంచి పనులు చేస్తారనే నమ్మకం నాకు ఉంది. నేను ఆయన పార్టీలో ఓ వాలంటీర్‌గా ప్రజలల్లోకి వెళ్లి, ఆయన తరపున ప్రచారం చేస్తా అని విశాల్ పేర్కొన్నారు. విశాల్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ కూడా వేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల సంఘం తిరస్కరించింది.













