దసరా బరిలో ‘ఎనిమీ’
కోలీవుడ్ నటులు విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ఎనిమి. వినోద్ కుమార్ నిర్మాత. మృణాలిని రవి, మమతా మోహన్ దాస్ కథానాయికలు, ప్రకాశ్‌రాజ్ ఓ కీలక పాత్ర పోషించారు. తంబి రామయ్య, కరుణాకరన్ ఇతర ప్రాతల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాని దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృదం ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త లుక్ పంచుకున్నారు. ఆ పోస్టర్లో విశాల్, ఆర్య ముఖం నిండా గాయాలతో ఒకరినొకరు సీరియస్‌గా చూసుకుంటూ ఆసక్తికరంగా కనిపించారు. ప్రేక్షకుల్ని మెప్పించే పసందైన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. విశాల్, ఆర్యల మధ్య నడిచే పోరు ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రాన్ని మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్.వినోద్ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయగ్రహణం: ఆర్.డి.రాజశేఖర్.













