విరాట పర్వం టీజర్ విడుదల…
లీడర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన వర్సటైల్ యాక్టర్ రానా పలు భాషలలో ప్రతిష్టాత్మక సినిమాలు చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో విరాట పర్వం సినిమా చేస్తుండగా, వివిధ భాషలలో డిఫరెంట్ ప్రాజెక్టస్ చేస్తున్నాడు. అయితే రానా బర్త్ డే సందర్భంగా ఆయన పోస్టర్‌తో పాటు వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా రానా.. రవిశంకర్ అలియన్ రవన్న అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలియజేశారు. 1990లో జరిగిన యదార్ధ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది.
తాజాగా విడుదలైన టీజర్లో ఈ దేశం ముందు ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది. సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది అంటూ టైటిల్స్ వేశారు. ఇక రానా కామ్రేడ్ లుక్ అదిరింది. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్న.. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీరావ్, సాయిచంద్, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.













