యానిమల్ వయొలెన్స్‌ను తట్టుకోవడం కష్టమే!
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తోన్న యానిమల్ సినిమాపై బాలీవుడ్లోనే కాదు అన్ని భాషల ఆడియన్స్‌కు మంచి అంచనాలున్నాయి. ఓపెనింగ్ రోజు కలెక్షన్స్ ను చూస్తే ఈ అంచనాలపై ఓ క్లారిటీ వస్తోంది. లిరికల్ వీడియోస్తోనే ఈ సినిమాపై అంచనాలను రోజురోజుకీ పెంచుతున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.
ఈ సినిమా గురించి రణ్‌బీర్ మాట్లాడుతూ ఇలాంటి డార్క్ అండ్ డీప్ డ్రామాలో తానెప్పుడూ నటించలేదని, ఇలాంటి ఛాలెంజ్ ఉన్న క్యారెక్టర్ తనకు ఇప్పట్లో వస్తుందన్న నమ్మకం కూడా లేదని చెప్పడంతో రణ్‌బీర్ క్యారెక్టర్‌పై ఓ రేంజ్ హైప్ వచ్చేసింది. ఇదిలా ఉంటే మరోవైపు రణ్‌బీర్ చెప్పింది నథింగ్ అని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
యానిమల్ లో ఒళ్లు గగుర్పొడిచే వయొలెన్స్ పెద్ద మొత్తంలో ఉంటుందని, విలన్స్ ను ఈ సినిమాలో నరరూప రాక్షసుల్లా చూపించడం స్టార్ హీరోల సినిమాల్లో ఇదే ఫస్ట్ టైమ్ అవుతుందని చెప్తున్నారు. సందీప్ రెడ్డి చాలా తెలివిగా క్యానిబాల్స్ కల్చర్‌ను ఈ సినిమా కథలో పొందుపొరిచాడంటున్నారు. అంతేకాదు, రణ్‌బీర్ ఫ్యామిలీ చేసే దారుణాలు కూడా వేరే లెవెల్లో ఉంటాయని, రణ్‌బీర్ ను రష్మిక ప్రేమిస్తుండటంతో ఆ ఫ్యామిలీలో మార్పు కోసం హోమాలు, యాగాలు చేయిస్తుందని తెలుస్తోంది. వీటన్నింటినీ బట్టి చూస్తుంటే యానిమల్ మూవీకి ఏ సర్టిఫికెట్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.













