ఫిబ్రవరి 18 రిలీజ్ కానున్న “వినరో భాగ్యము విష్ణు కథ”
GA2
ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ అన్ని మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. అలానే రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. నెంబర్ నైబరింగ్ కాన్సప్ట్ తో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న థియేటర్స్ లో భారీగా విడుదల కాబోతుంది.
ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ సభ్యుల మన్ననలు పొంది U/A సర్టిఫికెట్ ను సాధించుకుంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ సినిమాను, GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. కశ్మీరా కథానాయికగా నటిస్తుండగా, మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్.













