పవన్- రవితేజ జంటగా విక్రమ్ వేదా రీమేక్?
ఏదైనా రీమేక్ న్యూస్ రావడం లేట్ ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇది నిజం కాకూడదని ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. ముఖ్యంగా మెగ బ్రదర్స్ విషయంలో అయితే మాత్రం వామ్మ అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వరుసగా మూడు రీమేక్స్ చేయడం, వాటిలో ఏదీ వంద కోట్ల షేర్ ను దక్కించుకోకపోవడంతో ఫ్యాన్స్ నిరాశతో ఉన్నారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఓజీ మీదే ఉన్నాయి. చాలా ఏళ్ల తర్వాత పవన్ చేస్తున్న స్ట్రయిట్ మూవీ కావడంతో సెప్టెంబర్ 2న రిలీజ్ కానున్న ఓజీ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే విక్రమ్ వేదా రీమేక్ ని పవన్, రవితేజ కాంబోలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇవన్నీ రూమర్స్ అని తెలుస్తోంది. ప్రొడ్యూసర్ రామ్ తాళ్ళూరి, సురేందర్ రెడ్డికి పవన్ ఒక కమిట్మెంట్ బాకీ ఉన్న మాట నిజమే కానీ అది విక్రమ్ వేదా కోసం కాదని టాక్. నేల టికెట్టు సినిమాతో నష్టపోయిన ఈ ప్రొడ్యూసర్ కి మరో సినిమా చేయడానికి రవితేజ రెడీగా ఉన్నాడట. కానీ స్టోరీ మాత్రం దొరకలేదు. ఈ మల్టీస్టారర్ విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ ఏ విషయం క్లారిటీ గా తెలియదు.













