Varun Tej: జానర్ మారుస్తున్న వరుణ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun tej) కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఎప్పటికప్పుడు ఈ సినిమా వర్కవుట్ అవుతుందని ఆశలు పెట్టుకోవడమే తప్పించి, ఏదీ సరైన ఫలితాన్ని అందుకోవడం లేదు. దేనికదే వరుణ్ మార్కెట్ ను దెబ్బ తీస్తుంది తప్ప ఏ సినిమా వరుణ్ కెరీర్ కు ఉపయోగపడలేదు. వరుణ్ సోలోగా హిట్ అందుకుంది తొలిప్రేమ(tholiprema) సినిమాతోనే.
దీంతో సినిమాల సెలక్షన్ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న వరుణ్ తేజ్, ప్రస్తుతం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్(venkatadri express) ఫేమ్ మేర్లపాక గాంధీ(merlapaka gandhi) దర్శకత్వంలో కొరియన్ కనకరాజు(korean kanakaraju) చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవకుండానే వరుణ్ ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. టచ్ చేసి చూడు(touch chesi chudu) డైరెక్టర్ విక్రమ్ సిరికొండ(vikram sirikonda) డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి వరుణ్ ఓకే అన్నాడట.
వాస్తవానికి వరుణ్ ఈ ప్రాజెక్టును గతేడాదే ఫైనల్ చేసినప్పటికీ స్క్రిప్ట్, కాల్షీట్స్ విషయంలో క్లారిటీ రాకపోవడంతో లేటైందట. ఇప్పుడు అన్నీ క్లారిటీ రావడంతో ఈ ప్రాజెక్టు డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందట. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మించనున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాను విక్రమ్ రెగ్యులర్ లవ్ స్టోరీ లా కాకుండా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాలని చూస్తున్నారట.