Nithin: నితిన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్
2016లో అఆ(AAa).. సినిమా తర్వాత నితిన్(nithin) ఎన్నో సినిమాలు చేశాడు. మంచి మంచి కాంబినేషన్లతో వర్క్ చేశాడు. వాటిలో భీష్మ(bheeshma) తప్ప మిగిలినవన్నీ నితిన్ కు నిరాశనే మిగిల్చాయి. రీసెంట్ గా తమ్ముడు(thammudu) సినిమాతో దారుణమైన ఫ్లాపు ను అందుకున్న నితిన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి దిల్ రాజు(dil raju) బ్యానర్ లో ఎల్లమ్మ(Yellamma) కాగా మరోటి విక్రమ్ కె కుమార్(vikram k kumar) తో సినిమా.
తమ్ముడు సినిమా ఫలితంతో ఎల్లమ్మ కాస్త వెనక్కి జరగ్గా, నితిన్ తన తర్వాతి సినిమాను విక్రమ్ తోనే చేయనున్నాడని తెలుస్తోంది. ఇష్క్(Ishq) సినిమాతో వీరిద్దరూ కలిసి బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పని చేసింది లేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ ఓ సినిమా చేయబోతున్నారు.
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ హార్స్ రైడర్ గా కనిపించనున్నాడని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. నితిన్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ మేకర్స్ అవేమీ పట్టించుకోకుండా కథపై నమ్మకంతో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను త్వరలోనే మొదలుపెట్టి 2026లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.







