మానిటర్ చూడనని చెప్పిన విక్రమ్
సౌత్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ గ్రేటెస్ట్ యాక్టర్ల లిస్ట్ లో విక్రమ్ కూడా ఒకడు. కమల్ హాసన్ తర్వాత ఆయన లానే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రమ్. కొద్ది గ్యాప్ లోనే శివపుత్రుడు, సామి, అపరిచితుడు లాంటి మూడు భిన్న సినిమాలు చేసి మూడింటితోనూ బ్లాక్బస్టర్ హిట్లు కొట్టాడు విక్రమ్.
కానీ ఆ హ్యాట్రిక్ బ్లాక్బస్టర్ల తర్వాత విక్రమ్ కు ఇప్పటిరవకు సరైన హిట్ పడలేదు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న విక్రమ్ కు తాను కోరుకుంటున్న సక్సెస్ మాత్రం దొరకట్లేదు. ఇప్పుడు తంగలాన్ అనే సినిమాతో విక్రమ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ కు వచ్చిన విక్రమ్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు.
షూటింగ్ టైమ్ లో షాట్ పూర్తవగానే మానిటర్ లో తన పెర్ఫార్మెన్స్ చూసుకునే అలవాటు తనకు లేదని విక్రమ్ చెప్పాడు. అసలు తానెప్పుడూ మానిటర్ చూడనని అతను వెల్లడించాడు. తనకు మానిటర్ చూసే అలవాటు లేదని, డైరెక్ట్ డబ్బింగ్ టైమ్ లోనే విజువల్స్ చూస్తానని, తంగలాన్ సినిమా సీన్స్ ను కూడా ఎప్పుడూ మానిటర్లో చూడలేదని, డబ్బింగ్ చెప్పే టైమ్ లో తను చేసిన సీన్స్ తనకే షాకింగ్ గా అనిపించాయని, తన లుక్ తనని ఆశ్చర్యపరిచిందని, తనలానే ఆడియన్స్ కూడా సినిమా చూసి షాకింగ్ కు గురవుతారని విక్రమ్ వెల్లడించాడు.













