నాని సినిమాకు ఆయన కథ
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చిన హీరో నాని, తన కెరీర్లో ఎన్నో ఒడిదుడికులు ఎదుర్కొని నేచురల్ స్టార్ గా ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన జర్నీని మొదలుపెట్టి నేచురల్ స్టార్ గా నాని ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం, నాని మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్న ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించనున్నారట. తమిళ డైరెక్టర్ శిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయని, స్క్రిప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుందని తెలుస్తోంది.
తెలుగుతో పాటూ తమిళ భాషలో కూడా ఈ సినిమా రూపొందనుందని, త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. వాస్తవానికి నాని, శిబి చక్రవర్తి కాంబోలో సినిమా రానుందని వార్తలెప్పట్నుంచో వినిపిస్తున్నాయి కానీ ఆ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించనున్నారనేది మాత్రం కొత్త విషయమం. ఇది తెలుసుకున్న నాని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.













