విజయేంద్ర ప్రసాద్ పారితోషకమెంతో తెలుసా?
మోస్ట్ సక్సెస్ఫుల్ రైటర్ గా ఉన్న టాలీవుడ్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజమౌళి సినిమాలతో ఆయన ఇమేజ్ బాగా పెరిగిపోయంది. టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా విజయేంద్ర ప్రసాద్‌ను కథలు అడుగుతున్నారంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పుడు రాజమౌళి సినిమాలకు మాత్రమే కథలందించే విజయేంద్ర ప్రసాద్ బజరంగీ భాయ్ జాన్ తర్వాత ఇతర దర్శకుల సినిమాలకు కూడా కథలందిస్తున్నారు. అలా వచ్చిన సినిమానే మణికర్ణిక కూడా. ఇప్పుడు బాలీవుడ్ లో సీత ది ఇన్కారినేషన్ అనే మూవీకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథనందిస్తున్నాడు. ఎలాగూ రాజమౌళి- మహేష్ కాంబోలో రానున్న సినిమాకు స్టోరీ ఇస్తుంది ఈయనే.
అయితే రైటర్స్ కు చెప్పుకోదగ్గ రీతిలో రెమ్యూనరేషన్ ఉండదు. మామూలుగా రైటర్స్ కు రూ.2 కోట్ల రెమ్యూరేషన్ ఇవ్వడమే చాలా అరుదు. అలాంటిది విజయేంద్ర ప్రసాద్ నుంచి కథ కావాలంటే రూ.5 కోట్లు పారితోషికం ఆయనకు ముట్టజెప్పాలట. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రైటర్ గా హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది ఈయనే అని చెప్పాలి. మహేష్- రాజమౌళి మూవీ తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరగడం ఖాయం.













