తెలుగు మెగా సీరియల్ లో లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి
టాలీవుడ్ లో విజయశాంతికి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమా తో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు అని అందరూ భావించారు. అయితే వరకు ఆమె ఏ సినిమాలలో కమిట్ అయ్యిందో తెలియడం లేదు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమె దాదాపు నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేసిందని దీంతో చిత్ర యూనిట్ బాగా ఇబ్బంది పడిందని, అయితే మహేష్ మాత్రం ఆమెను తీసుకుంటేనే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆమెను ఆ సినిమాలో తీసుకున్నారని తెలిసింది. ఆమె పారితోషకం అధికంగా ఉండడంతో భారీ నిర్మాణ సంస్థలు కూడా వెనకడుగు వేస్తున్నాయని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు విజయశాంతి తెలుగు సీరియల్స్ లో నటించే అవకాశం ఉందని తెలుస్తుంది.
త్వరలోనే తెలుగులో ఒక మెగా సీరియల్ మొదలుకానుంది. మంచి ఫాన్సీ ఆఫర్ ఇచ్చిన ‘స్టార్ మా’ నిర్మిస్తున్న ఈ సీరియల్ లో విజయశాంతి నటించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సినిమాలో ఆమె గృహిణిగా మాత్రమే కనబడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ సీరియల్ ఎప్పుడు మొదలవుతుంది ఏంటి అనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ విజయశాంతి మాత్రం ఈ సీరియల్ లో నటించడానికి కూడా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి విజయశాంతి తన సోషల్ మీడియా ఖాతాలో అధికారిక ప్రకటన చేయడానికి రెడీగా ఉన్నారట. ప్రస్తుతం విజయశాంతి ఏ సినిమాలో కూడా నటించడం లేదు. ఇటీవల రెండుమూడు సినిమాల్లో ఆమె నటించే అవకాశం ఉంది అని ప్రచారం జరిగింది కానీ దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి వార్తలు కూడా బయటకు రాలేదు. ఇక ఇప్పుడు ఆమె సీరియల్లో నటించడంతో ఆమె ఫ్యాన్స్ ఆమె కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.













