RC16 గురించి మరో పుకారు
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి బయటకు రావాలని చూస్తున్నాడు చరణ్. ఇదిలా ఉంటే చరణ్ తన తర్వాతి సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానతో చేయనున్న విషయం తెలిసిందే. చరణ్ కెరీర్లో ఈ సినిమా 16వ చిత్రంగా తెరకెక్కబోతుంది.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమా విలేజ్ డ్రామాగా రూపొందనుంది. అయితే ఈ సినిమా గురించి గత రెండ్రోజులుగా నెట్టింట ఓ వార్త హల్చల్ చేస్తుంది. ఇందులో హీరోకు తల్లిగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేదే ఆ వార్త. కానీ అంతర్గత సమాచారం ప్రకారం ఆ వార్తలన్నీ పుకార్లేనని తెలుస్తోంది.
ఈ సినిమా కోసం బుచ్చిబాబు బలమైన క్యాస్టింగ్ కోసం ట్రై చేస్తున్న మాట నిజమే కానీ విజయశాంతిని అయితే కలుసుకోలేదంటున్నారు. సరిలేరు నీకెవ్వరు టైమ్ లోనే మళ్లీ సినిమాల్లో నటించనని విజయశాంతి క్లారిటీ ఇచ్చింది. దానికి తోడు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆమె కీలక సభ్యురాలిగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో మళ్లీ సినిమాలు చేయాలనే ఆలోచన ఆమె చేయదు. ఇక ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం ఇప్పటికే మూడు సాంగ్స్ ను పూర్తి చేశాడు. మిగిలిన పాటలను కూడా ఈ సమ్మర్ లోనే పూర్తి చేయనున్నాడట రెహమాన్.













