Akhanda2: అఖండ2లో సీనియర్ హీరోయిన్

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కలయికలో వచ్చిన అఖండ(Akhanda) సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఆ సినిమాకు సీక్వెల్ గా అఖండ2(Akhanda2) ను తెరకెక్కిస్తున్నారు. బ్లాక్ బస్టర్ అఖండకు కొనసాగింపుగా వస్తున్న సినిమా కావడంతో అఖండ2 పై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బోయపాటి ఓ స్పెషల్ పాత్రను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.
ఆ స్పెషల్ క్యారెక్టర్ కోసం బోయపాటి ఓ సీనియర్ హీరోయిన్ ను రంగంలోకి దించాలనుకుంటున్నాడట. ఆమె మరెవరో కాదు. విజయశాంతి(Vijayasanthi). బాలయ్య- విజయశాంతి కాంబినేషన్ వర్కవుట్ అయితే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అంతా భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాలి కానీ ఒకవేళ నిజమైతే మాత్రం అఖండ2 లో ఆ రోల్ మెయిన్ హైలైట్ గా నిలవడం ఖాయం.
కాగా అఖండ2 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. బాలయ్య(Balayya) అఘోరా గెటప్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట బోయపాటి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్(Thaman) సంగీతం అందిస్తుండగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అఖండ2 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.