విజయనిర్మల అంత్యక్రియలు పూర్తి
నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా అలరించిన అందాల తార విజయ నిర్మల భౌతికంగా మనకి దూరమయ్యారు. మొయినాబాద్ మండలం చిలుకూరులోని ఫామ్ హౌస్‌లో విజయ నిర్మల అంత్యక్రియలు పూర్తి చేశారు. విజయ నిర్మల కొడుకు నరేష్ ఆమె చితికి నిప్పటించారు. విజయ నిర్మలని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఫాంహౌస్‌కి భారీ తరలి వచ్చారు. విజయ నిర్మల ఏ లోకంలో ఉన్న కూడా ఆమె ఆత్మ కృష్ణగారి చుట్టూనే తిరుగుతుందని పలువురు ప్రముఖులు చెబుతున్నారు. ఎప్పుడు తన వెంట ఉండే విజయ నిర్మల ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్ళారు అనే విషయాన్ని కృష్ణ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో అన్యోన్నమైన జంటగా పలువురికి ఆదర్శంగా నిలిచారు కృష్ణ, విజయ నిర్మల. ఆమె మనకి బౌతికంగా దూరమైన తన సినిమాల ద్వారా ఎప్పటికి అలరిస్తూనే ఉంటారు. ఆమె పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని సినీ, రాజకీయ ప్రముఖులు ప్రార్థించారు. కుటుంబ సభ్యులకి ఆత్మస్థైర్యాన్ని అందించాలని ఆ దేవుడిని ప్రార్తిస్తున్నట్లు తెలిపారు. విజయ నిర్మల అంతిమ యాత్ర నానక్‌రామ్‌గూడలోని ఆమె ఇంటి నుండి ఫామ్‌హౌస్ వరకు అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది.













