విజయనిర్మలకు అరుదైన గౌరవం
నాటి స్టార్ హీరోయిన్, నటిగా మంచిస్థాయిలో ఉండగానే మెగాఫోన్ చేతపట్టి దర్శకురాలిగా 46 సినిమాలకు డైరెక్టుచేసిన విజయనిర్మలకు మరో అరుదైన పురస్కారం దక్కింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా యుకె కు చెందిన రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్పీన్ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. 1957లో తొలిసారిగా నటిగా తెలుగు తెరపై కన్పించిన విజయనిర్మల ఆ తర్వాత తెలుగుతోపాటు, తమిళ, మలయాళ భాషల్లో కూడా అనేక సినిమాల్లో నటించారు. ఆమె నటనలో ఉండగానే దర్శకురాలిగా మారి ప్రజల మనిషి, హేమాహేమీలు, జెజవాడ బెబ్బులి వంటి పలు హిట్ చిత్రాలు తీసి భారతదేశంలోనే అత్యధిక సినిమాలకు డైరెక్టు చేసిన మహిళా దర్శకురాలిగా ఘనత వహించారు.













