ఆ మహిళ దర్శకత్వ రికార్డును బ్రేక్ చేసిన విజయనిర్మల
44 సినిమాలకు దర్శకత్వం వహించి, అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సొంతం చేసుకున్నారు. అప్పటివరకు ఇటలీ దర్శకురాలు పేరిట ఉన్న 27 సినిమాల మహిళ దర్శకత్వ రికార్డును విజయనిర్మల అధిగమించడం గర్వించదగ్గ విషయం. అలాగే సినిమా పరిశ్రమకు చేసిన సేవలకు ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్యనాయుడుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయనిర్మలను సముచితగా గౌరవించింది. సేవా కార్యక్రమాల్లోనూ ఆమె ముందే ఉంటారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఆమె ముందే ఉన్నారు. ముఖ్యంగా మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)కి ప్రతి ఏడాది తనవంతు సాయాన్ని అందిస్తున్నారు. ఆమె అందిస్తున్న సేవలకు గానూ 2017లో ది రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ యుకే గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఆరు దశాబ్దాల సినీ జీవితంతో తెలుగు, తమిళ, మలయాళంలో 200కి పైగా చిత్రాల్లో నటించడంతో పాటు 44 చిత్రాలకు దర్శకత్వం వహించి, 15 సినిమాలు నిర్మించారు. క్లాస్, మాస్, యాక్షన్, సెంటిమెంట్, ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్ వంటి అన్ని రకాల చిత్రాలను చేసి మెప్పించిన విజయనిర్మల సినీ రంగంలో ఒక మహిళ తరంగంగా నిలిచారు.













