ఆ బ్యానర్లో మరో సినిమా చేయనున్న విజయ్
ఖుషి సినిమాతో రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ, ఆ సినిమాతో యావరేజ్ టాక్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగానే నచ్చిందని టాక్ వచ్చింది కానీ నిర్మాతలకు మాత్రం ఈ సినిమా ఆశించిన రాబడులు తెచ్చి పెట్టలేదు. కనీసం సినిమా బ్రేక్ ఈవెన్ అయిందో లేదో కూడా తెలియదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరితో, మరొకటి దిల్ రాజు బ్యానర్లో పరశురామ్ దర్శకత్వంలో. ఈ రెండు సినిమాలపై అందరికీ చాలానే అంచనాలున్నాయి. ప్రతీ సినిమాకు తన ఇమేజ్ను పెంచుకుంటున్న దేవరకొండకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంతేమంది యాంటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా సరే నిర్మాతలు విజయ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైజయంతీ మూవీస్ విజయ్‌తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ఇప్పటికే అగ్రిమెంట్ కూడా అయిపోయిందని టాక్. డైరెక్టర్ ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు. కల్కి సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నారట. ఈ లోపు డైరెక్టర్‌ను కూడా ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇప్పటికే వైజయంతీ మూవీస్ బ్యానర్లో విజయ్ ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాల్లో నటించాడు. ఆ రెండు మంచి టాక్‌ను తెచ్చుకోగా, ఈ సినిమా వారి కాంబోలో హ్యాట్రిక్‌గా నిలుస్తుందేమో చూడాలి.













