ఎనిమిదేళ్ల తర్వాత కోలీవుడ్లోకి పూజా హెగ్డే
తమిళ చిత్రం ముగమూడి తో 2012లో కథానాయికగా అరంగేట్రం చేసింది పూజా హెగ్డే. మిస్కిన్ దర్వకత్వంలో రూపొందిన ఈ చిత్రం పరాజయం పాలవ్వడంతో కోలీవుడ్‌లో మరో అవకాశాన్ని దక్కించుకోలేకపోయింది ఈ కన్నడ సోయగం. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత పూజాహెగ్డే తమిళంలో పునరాగమనం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ అగ్రకథానాయకుడు విజయ్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రయోగాత్మక కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా పూజాహేగ్డేను కథానాయికగా తీసుకునే యోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది. ఇటీవలే దర్శకనిర్మాతలు పూజాహెగ్డేను సంప్రదించినట్లు సమాచారం. కథ నచ్చడంతో ఆమె ఈ సినిమా చేయడానికి సుముఖతను వ్యక్తం చేసిందని చెబుతున్నారు.













