Vijay Sethupathi: ఆ హీరోతో కలిసి నటించాలనుంది: సేతుపతి
విజయ్ సేతుపతి(Vijay Sethupathi) క్రేజ్, తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుంది. హీరోగా అయినా, విలన్ గా అయినా ఆయన ఏ పాత్ర చేసినా అందులో తన మార్క్ ఉండేలా చూసుకుంటాడు. ప్రస్తుతం సౌత్ లోనే డిమాండింగ్ యాక్టర్ గా సేతుపతికి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన విజయ్ సేతుపతితో ప్రతీ డైరెక్టర్ పని చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతటి క్రేజ్ ఉన్న నటుడు టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna)తో కలిసి పని చేయాలనుందని ఆసక్తి చూపించడం విశేషం. విడుదల2(Vidudhala2) ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాన్ని సేతుపతి వెల్లడించాడు.
నాగ్(Nag) సర్ తో పని చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నానని, కానీ కుదరడం లేదని ఈసారి అవకాశమొస్తే అసలు మిస్ చేసుకోననే రేంజ్ లో సేతుపతి తెలిపాడు. ఇప్పటివరకు తనకొచ్చిన అవకాశాలను మాత్రమే చేసుకుంటూ సేతుపతి చేసుకుంటూ వెళ్లాడు తప్పించి ఎప్పుడూ ఫలానా నటుడితో నటించాలనుందని చెప్పింది లేదు. అలాంటి ఆయన ఇప్పుడు నాగ్ తో కలిసి పని చేయాలనుందని చెప్పడం విశేషం.













