కథ కుదిరితే తప్పకుండా దర్శకత్వం చేస్తా: సేతుపతి
ఓ వైపు హీరోగా, మరోవైపు స్టార్ హీరో సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. తాజాగా మహారాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సేతుపతికి ఆ సినిమా ప్రమోషన్స్ లో దర్శకత్వ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయనే ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. దానికి సేతుపతి ఆశ్చర్యపోయే సమాధానమిచ్చాడు.
మంచి కథలు కుదిరితే తప్పకుండా డైరెక్టర్ గా పనిచేస్తానని, ఇప్పటికే మూడు సినిమాలకు స్టోరీ, స్క్రీన్ ప్లే రెడీ చేసుకున్నట్లు సేతుపతి తెలిపాడు. సేతుపతి మాటలను బట్టి చూస్తే అతను తన కెరీర్ విషయంలో చాలా ప్లానింగ్ తోనే ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ ఉంటే సెట్స్ లో, లేదంటే ఫ్రీ టైమ్ లో ఇలా కథలు రాసుకుంటూ ఉంటాడని అర్థమవుతోంది.
ఆయన సన్నిహితులు మాత్రం సేతుపతికి నటుడిగా అవకాశాలొచ్చినంత కాలం ఆ మార్గంలోనే ఉంటాడని, ఛాన్సులు రావడం తగ్గినప్పుడు కెప్టెన్ కుర్చీలో కూర్చుంటాడని అంటున్నారు. నటుడిగా సేతుపతి ఎంతో బలమైన ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. మరి సేతుపతి డైరెక్టర్ గా ఎలాంటి సినిమాలు తీస్తాడన్నది ఇప్పుడందరికీ ఆసక్తికరంగా మారింది.













