కొత్త ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్న విగ్నేష్ శివన్..
కోలీవుడ్ వర్సటైల్ డైరెక్టర్స్ లో విగ్నేష్ శివన్ ఒకరు. విభిన్నమైన కథా, కథనాలతో ఈ డైరెక్టర్ ఆడియన్స్ మనసు దోచుకున్నారు. ప్రతి సినిమాకి తన జోనర్ ని మారుస్తూ ప్రేక్షకులకి వినోదాన్ని పంచడమే ధ్యేయంగా విగ్నేష్ కథల్ని సెలెక్ట్ చేసుకోవడం విశేషం. గతేడాది తమిళం లో సూపర్ హిట్ కొట్టిన ఈ దర్శకుడు తన తదుపరి సినిమాని కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. AK 62 అని ఈ ప్రాజెక్ట్ ని ఫిక్స్ చేసి స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్న తరుణంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుండి విగ్నేష్ తప్పుకున్నారు.
ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరపైకి వచ్చి తన టాలెంట్ తో హీరోగా మారిన విజయ్ సేతుపతిని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సంప్రదించినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ సేతుపతి హీరోగా, ప్రముఖ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని తెరకెక్కించాలని విగ్నేష్ శివన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే ఈ వార్తలపై ఇంకా అఫిషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. త్వరలోనే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్న తరుణంలో విజయ్ సేతుపతి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ ముగ్గరి కాంబినేషన్ లో వచ్చిన ” కాతువాకుల రెండు కాదల్ ” అనే సినిమా తమిళంలో సూపర్ హిట్ అవ్వడంతో. ఈ ప్రాజెక్ట్ పై కూడా అభిమానులు భారీగా అంచనాలు పెంచుకున్నారు. మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై తప్పకుండా మ్యాజిక్ చేస్తుందని ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు.













