వినాయక చవితి సందర్భంగా ‘లాభం’
విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం లాభం. ఇందులో జగపతిబాబు, సాయిధన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎస్పీ జననాధన్ దర్శకత్వంలో తెరకెక్కింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 9న ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ విజయ్ సేతుపతి, శుత్రిహాసన్ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, భాషల్లో ఏకకాలంలో సెప్టెంబర్ 9న విడుదల చేస్తున్నామన్నారు. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రానికి శ్రీగాయత్రి దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి లాయర్ శ్రీరామ్ సమర్పణ హరీష్‌బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.













