మరో రీమేక్‌కు అక్షయ్ కుమార్ గ్రీన్‌సిగ్నల్
బాస్, హాలీడ్, గబ్బర్ఈజ్బ్యాక్తో పాటు పలు దక్షిణాది సినిమాల్ని హిందీలో రీమేక్ చేసి విజయాల్ని అందుకున్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. తాజాగా ఆయన మరో రీమేక్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. విజయ్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కత్తి. కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడే ఓ రౌడీ కథతో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. అక్షయ్‌కుమార్ హీరోగా ఈ చిత్రం బాలీవుడ్లో రీమేక్ కాబోతున్నది. అక్షయ్‌తో మిషన్ మంగళ్ సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు జగన్ శక్తి ఈ రీమేక్‌ను తెరకెక్కించే బాధ్యతల్ని చేపట్టారు. ఈ రీమేక్‌కు ఇక్కా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో అక్షయ్‌కుమార్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు.













