అప్‌కమింగ్ డైరెక్టర్‌తో విజయ్ సినిమా
ఖుషి సినిమా ఆశించిన రిజల్ట్ ని ఇవ్వకపోయినా విజయ్ దేవరకొండ ఈ సారి ఎక్కువగా నిరాశ పడలేదు. వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్, లైగర్ సినిమాల్లా ఈ సినిమా కాకుండా ఫర్వాలేదనిపించిందని కాస్త కుదుటపడ్డాడు. మంచి కాంబినేషన్లో సినిమా చేసి, కష్టపడితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారనే ఫీలింగ్ తనకొచ్చింది.
అసలు విషయం అర్థం చేసుకున్న విజయ్, దానికి తగ్గట్టే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం పరశురామ్ పెట్ల, గౌతమ్ తిన్ననూరితో సినిమాలు చేస్తున్న విజయ్, ఆ తర్వాత రాజావారు రాణిగారు డైరెక్టర్ రవి కిరణ్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అతి త్వరలోనే వచ్చే అవకాశముంది.
ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడట. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ డిఫరెంట్ ట్రీట్మెంట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడన రవి. రాజా వారు రాణి గారు హిట్ కాకపోయినా దాన్ని రవి ప్రెజెంట్ చేసిన తీరుకు ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. అప్‌కమింగ్ డైరెక్టర్లతో మంచి సినిమాలు చేసి తన క్రేజ్, స్టేటస్ పెంచుకోవాలని చూస్తున్న విజయ్‌తో రవికిరణ్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి మరి.













