విజయ్ నిజంగానే సినిమాలు చేయడా?
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన గోట్ సినిమా రీసెంట్ గా రిలీజై డిజాస్టర్ అయింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ దృష్టంతా ఆయన చేయబోయే రాజకీయం వైపు మళ్లింది. అయితే విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లే ముందు మరో సినిమా చేస్తానని కమిటవడంతో ఆ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. హెచ్ వినోత్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనుంది.
ఇదంతా బానే ఉంది కానీ విజయ్ చివరి సినిమా ఇదే అవుతందా అంటే కచ్ఛితంగా కాదంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు గతంలో చెప్పారు. కానీ తిరిగి మేకప్ వేసుకున్నారు. కమల్ హాసన్ ఎంతో ఆవేశంగా పార్టీ పెట్టి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేయకుండానే కాంగ్రెస్ కు మద్దతిచ్చిరు.
ప్రజారాజ్యం టైమ్ లో చిరంజీవి కూడా అలానే చెప్పాడు. కానీ తర్వాత ఖైదీ నెం.150 అంటూ మళ్లీ వచ్చి ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు. అజ్ఞాతవాసి టైమ్ లో పవన్ కళ్యాణ్ కూడా అదే తన లాస్ట్ మూవీ అని చెప్పి తర్వాత వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. కాబట్టి విజయ్ కేవలం రాజకీయాలకే పరిమితమవుతాడనేది కచ్ఛితంగా నమ్మలేం. పైగా స్టాలిన్ గవర్నమెంట్ని ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నా అందరూ ఓట్లేస్తారని నమ్మకంగా చెప్పలేం. కాబట్టి విజయ్ ఇకపై సినిమాలు చేయడని ఫ్యాన్స్ దిగులు పడాల్సిన పన్లేదు.













