విజయ్- గౌతమ్ సినిమా చాలా భారీగా!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్ ఫ్యామిలీ స్టార్ ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ పోటీ ఎక్కువ ఉండటం వల్ల మార్చికి వాయిదా వేసుకున్నారు. గీత గోవిందం లానే ఈ సినిమాతో కూడా మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు విజయ్. ఈ సినిమా తర్వాత విజయ్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా తెరకెక్కబోతుంది. విజయ్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు సితార బ్యానర్ టైర్2 హీరోలతో నిర్మించిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అంటున్నారు. సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరికల్లా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఖుషి సినిమాతో ఫ్లాప్ ను అందుకున్న విజయ్, ఫ్యామిలీ స్టార్ తో మంచి హిట్ అందుకుని తన మార్కెట్ ను స్ట్రాంగ్ చేసుకుంటే, ఆ తర్వాత వచ్చే గౌతమ్ తిన్ననూరి సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో తన స్టామినాను ప్రూవ్ చేసుకోవచ్చని ట్రై చేస్తున్నాడు. మరి గౌతమ్, విజయ్ కు ఎలాంటి ఫలితాన్నిస్తాడో చూడాలి.













