గోట్ ట్రైలర్ టాక్
తుపాకి సినిమా తర్వాత ప్రతి సినిమాతో తెలుగులో తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్. ప్రస్తుతం విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ అనే సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
కథ చెప్పకుండానే మూడు నిమిషాల ట్రైలర్ ను చాలా తెలివిగా కట్ చేశారు. ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ లో గూఢచారిగా పని చేసిన గాంధీ( విజయ్)కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. భార్య దగ్గర కూడా కొన్ని సీక్రెట్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ ఉంటాడు. ఎన్నో ప్రమాదకరమైన మిషన్స్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన గాంధీకి ఓ ప్రాబ్లమ్ ఎదురవుతుంది.
దానిలో అనుకోకుండా కొడుకు విజయ్‌ని కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆ టైమ్ లో తన శత్రువు నుంచి తప్పించుకుంటూ విదేశాల వీధుల్లో తండ్రీ కొడుకులిద్దరూ టెర్రరిస్టులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితులొస్తాయి. ఆ యుద్ధంలో తండ్రీ కొడుకులు ఎలా గెలిచారనేది తెలుసుకోవాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో విజయ్ మొత్తం మూడు షేడ్స్ ని రివీల్ చేశారు. మరో షేడ్ ఆడియన్స్ ను షాక్ కు గురిచేస్తుంది.













