విజయ్ దేవరకొండ సరసన క్యాథరిన్
దక్షిణాది నటి క్యాథరిన్ ధెరిస్సా లక్కీఛాన్స్ కొట్టేసింది. తమిళంలో బిజీగా ఉన్న ఈ నటికి టాలీవుడ్లో మాత్రం అవకాశాలు రావడం లేదు. సరైనోడు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ హీరోయిన్ రేస్‌లో బాగా వెనుకబడిపోయింది. ఈ దశలో ఆమెకు క్రేజీ హీరో విజయ్‌దేవరకొండ సరసన నటించే అవకాశం దక్కించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఓనమాలు, మళ్లీమళ్లీ రాని రోజు మూవీల ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నాడు. కె.ఎస్.రామారావు నిర్మిస్త్ను ఈ మూవీలో క్యాథరిన్‌ను తీసుకున్నారు.













