మలయాళం మల్టీ స్టారర్ సినిమాలో విజయ్ దేవరకొండ..?
రౌడీ స్టార్ ప్రముఖ మలయాళం హీరోతో స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నాడా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడని టాక్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. విజయ్ ఫాన్స్ మాత్రమే కాకుండా సినిమా ప్రియులు అందరు ఈ క్రేజీ కాంబో వెండి తెరపై ఎలా ఉండబోతుంది అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి టాలీవుడ్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రజెంట్ ఈ హీరో సామ్ తో కలిసి ఖుషి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సమంత అనారోగ్యం కారణం ఈ సినిమా వాయిదా పడుతుండడంతో వేరే ప్రాజెక్ట్స్ పై విజయ్ దృష్టి పెట్టాడు. మలయాళంలో కూడా తన పవర్ ని చూపించడానికి రెడీ అవుతున్నాడు ఈ రౌడీ హీరో. మోహన్ లాల్ వంటి సీనియర్ హీరో తో స్క్రీన్ షేర్ చేస్కోవడం తన కెరీర్ కి ప్లస్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రెజెంట్ మోహన్ లాల్ మలై కోటాయ్ వలీబన్ ప్రాజెక్ట్ లో బిజీ గా ఉండడం తో త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.
మైత్రి మూవీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మల్టీ స్టార్రర్ సినిమా కి ప్రముఖ దర్శకుడు తిరు పప్పాచాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడు రీసెంట్ గా హైదరాబాద్ వచ్చి విజయ్ దేవరకొండని కలిసి స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి విజయ్ కూడా ఓకే చెప్పినట్లు సినీ వర్గాలనుండి సమాచారం అందుతుంది. తెలుగులోనే కాకుండా మలయాళం తో సైతం రౌడీ స్టార్ తన సత్తా చూపించి అక్కడ కూడా ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే.













