బాక్సింగ్ కోసం గోవా వెళ్లనున్న లైగర్
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా లైగర్. కరోనా కారణంగా చిత్రీకరణకు కొంత విరామం ఏర్పడింది. త్వరలో మళ్లీ పున ప్రారంభం కానుంది. వచ్చే వారం టైగర్ చిత్రబృందం గోవాకు వెళ్లనుంది. అక్కడ భారీ షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేశారు. గోవాలో యాక్షన్ దృశ్యాలతో పాటు కొంత టాకీ పార్ట్ చిత్రీకరించడానికి పూరి జగన్నాథ్ సన్నాహాలు చేస్తున్నారు. గోవాలో చిత్రీకరణ పూర్తయిన తర్వాత విదేశాల్లో ఓ షెడ్యూల్ చేయనున్నారు. విజయ్ దేవరకొండకు, విదేశీ బ్యాక్సర్లకు మధ్య కొన్ని సన్నివేశాలను పారిన్ షెడ్యూల్లో తెరకెక్కిస్తారట. బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ సరసన హిందీ హీరోయిన్ అనన్యా పాండే నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, చార్మీ, కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు.













