ఖుషి రన్ టైమ్.. కాస్త రిస్కే
ఇంకో ఎనిమిది రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఖుషి సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ముందు ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారని అన్నారు కానీ సెన్సార్ బోర్డ్ మాత్రం ఖుషికి యూఏ సర్టిఫికెట్ అందించింది. అంటే పెద్దల సమక్షంలో పిల్లలు చూడాల్సిన సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయని సెన్సార్ బోర్డ్ చెప్పకనే చెప్పింది. ఖుషి సినిమా నిడివి కూడా 2 గం.ల 45 నిమిషాలుగా తెలుస్తోంది. లవ్, ఎమోషనల్ డ్రామాలకు ఈ రన్ టైమ్ చాలా ఎక్కువ. ఎంతో స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే తప్ప ఆడియన్స్ అంత సేపు థియేటర్లలో కూర్చోలేరు. ఆ విషయం తెలిసి కూడా డైరెక్టర్ శివ నిర్వాణ ఇంత రన్ టైమ్ పెట్టాడంటే దానికి రీజన్ ఉండే ఉంటుంది.
దేవుడిని నమ్మని నాస్తికుడి కొడుక్కి, దైవ ధ్యానం తప్ప మరోటి తెలియని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయికి మధ్య జరిగే లవ్ స్టోరీ గా శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించాడు. హీషం అబ్దుల్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. ఇన్ని పాజిటివ్ విషయాల మధ్య ఖుషి రన్ టైమ్ మాత్రం అందరికీ తేడా కొడుతుంది.
మేకర్స్ కావాలనే ఖుషి రన్ టైమ్ ను అంత ఎక్కువగా ఉంచారా లేక ట్రై చేసి వర్కవుట్ అవకపోతే నెక్ట్స్ డే ట్రిమ్ చేద్దామని ఆలోచిస్తున్నారా అనేది మాత్రం తెలియట్లేదు. శాకుంతలంతో భారీ ఫ్లాప్ అందుకున్న సమంత ఈ సినిమాపైనే తన ఆశలన్నింటినీ పెట్టుకుంది. గత మూడు సినిమాలుగా ఫెయిలవుతున్న విజయ్ దేవరకొండకు కూడా ఈ సినిమా విజయం కీలకం కానుంది.













