వరల్డ్ ఫేమస్ లవర్ సంచలనం
విజయ్ దేవరకొండ రొమాంటిక్, ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ వరల్డ్ ఫేమస్ లవర్ డిజిటిల్ ఫార్మాట్లో సంచలనం రేపుతోంది. ఏకంగా ఈచిత్రం ఇండియావైడ్‌గా సెకండ్ పొజిషన్లో ట్రెండ్ అవుతోంది. వరల్డ్ ఫేమస్ లవర్ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కాగా రెండు రోజుల క్రితం ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో ఆడియోన్స్‌కు అందుబాటులోకి తెచ్చింది. విశేష ఆదరణం దక్కించుకున్న వరల్డ్‌ఫేమస్ లవర్ మూవీ ఇండియా వైడ్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతూ సంస్థకు కాసుల వర్షం కురిపిస్తోంది. సీనియర్ నిర్మాత కెఎన్ రామారావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు.













