జాతి రత్నాలు కోసం రౌడీ హీరో
నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ జాతిరత్నాలు సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నాడు. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ను యూనిట్ మొదటి నుంచి డిఫరెంట్ గా ప్లాన్ చేస్తూ వస్తుంది.
ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ అయిన ట్రైలర్ కు ట్రెమండ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇంకొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరంగల్ లో గ్రాండ్ గా నిర్వహించనున్న ఈవెంట్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఛీప్ గెస్ట్ గా రానున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ.. ఒక ఫన్నీ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రౌడీ రత్నం ముగ్గురు జాతి రత్నాలను తరుముతున్నట్లుగా ఈ పోస్టర్ ని డిజైన్ చేశారు. ఏదేమైనా జాతిరత్నాలు టీమ్ సరికొత్తగా ప్లాన్ చేస్తూ అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకునేలా చేస్తున్నారు. రథన్ సంగీతమందించిన ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి.













