రౌడీ హీరోకు హిట్ కావలెను
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ తర్వాత నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో లీడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. అర్జున్ రెడ్డితో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.
కానీ గత కొన్ని సినిమాలుగా విజయ్ దేవరకొండ బ్యాడ్ టైమ్ నడుస్తోంది. విజయ్ దేవరకొండ చివరగా హిట్ కొట్టింది ట్యాక్సవాలా సినిమాతో. అది వచ్చి ఐదేళ్లవుతోంది. ఆ తర్వాత విజయ్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా హిట్ కాకపోగా డిజాస్టర్లుగా మిగిలాయి. రీసెంట్ గా వచ్చిన ఖుషి సినిమాతో విజయ్ మళ్లీ ట్రాక్ లోకి వస్తాడనుకుంటే ఆ సినిమా కూడా ఫ్లాప్ గానే మిగిలింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరశురామ్ పెట్లతో ఫ్యామిలీ స్టార్ చేస్తున్నాడు. దీంతో పాటూ గౌతమ్ తిన్ననూరితో మరో సినిమా ఒప్పుకున్నాడు. ఇప్పుడు విజయ్ కెరీర్ కు అర్జెంట్ గా కావాల్సింది ఓ బ్లాక్ బస్టర్ మూవీ. ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని విజయ్ తెగ ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ సినిమా చెప్పిన టైమ్ కు రాదంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యామిలీ స్టార్, విజయ్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













