ఆ అద్భుతం ఎలా ఉంటుందో చూడాల్సిందే!
విజయ్ దేవరకొండ… ఈ హీరో మొదట చేసిన సినిమాల వల్ల వచ్చిన ఇమేజ్ వేరు. ఆ తర్వాత చేసిన ‘అర్జున్‌రెడ్డి’తో వచ్చిన ఇమేజ్ వేరు. అతనితో సినిమాలు చెయ్యాంటే టిపికల్‌గా ఆలోచించే డైరెక్టర్లు, డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు తీసే డైరెక్టర్లు ముందుకు రావాలి. ఇప్పటివరకు అలాంటి డైరెక్టర్స్‌తోనే సినిమాలు చేస్తూ వచ్చాడు విజయ్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
ఇంద్రగంటి మోహనకృష్ణ… ఇతనో సెన్సిబుల్ డైరెక్టర్. చాలా సున్నితమైన కథాంశాలతో ఫ్యామిలీ అంతా అహ్లాదకరంగా కలిసి చూసే సినిమాలకు పెట్టింది పేరు. గ్రహణం, అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, మాయాబజార్, అంతకుముందు ఆ తరువాత, అమీతుమీ, సమ్మోహనం వంటి సినిమాలు మోహనకృష్ణ అభిరుచిని, తను చేసే సినిమాలు ఎలా ఉండాలి అనే ఆలోచనని తెలియజేస్తాయి. ప్రస్తుతం నానితో వి అనే సినిమా చేస్తున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. ఒకరి ఇమేజ్, ఒకరి అభిరుచి ఎలా కలుస్తాయి అనేది చెప్పడం కష్టమే. కానీ, ఇది నిజం కాబోతోంది. విజయ్ దేవరకొండ, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఎంతో మంది విజయ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. మోహనకృష్ణ మాత్రం… ఈ ఏడాది నీ నుంచి మంచి సినిమా రావాల్సి ఉంది. నువ్వు చేసే అద్భుతాల కోసం ఎదురుచూస్తున్నా అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దానికి సమాధానంగా.. థాంక్స్.. ఐతే ఆ అద్భుతం మనిద్దరం కలిసి చేయబోతున్నాం అని సమాధానమిచ్చాడు విజయ్. దీన్నిబట్టి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోందనే విషయం కన్ఫర్మ్ అయింది. మరి వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఆ సినిమా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో.. ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చెయ్యబోతుందో చూడాల్సిందే.













