హిట్ కాంబినేషన్ లో ప్యాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమవుతోంది!
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన `నువ్విలా` చిత్రంతో నటుడిగా పరిచయమై ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ చేసి పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా వెలుగులోకి వచ్చాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత చేసిన `అర్జున్‌రెడ్డి` అతని కెరీర్‌ను మార్చేసింది. ఈ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమా కథ, కథనాలతోపాటు అర్జున్‌రెడ్డి క్యారెక్టర్ కూడా అందర్నీ ఆకట్టుకుంది. అంతేకాదు ఆ క్యారెక్టర్లో కనిపించిన విజయ్ దేవరకొండ కూడా అందర్నీ ఆకర్షించాడు. దీంతో ఒక్కసారిగా అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా యూత్‌లో విజయ్‌కి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత అతను చేసిన `గీత గోవిందం`, `టాక్సీవాలా` సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `ఫైటర్` చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా పలు భాషల్లో విడుదల కానుంది. హిందీలో ఈ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వనున్నాడు విజయ్. ఇదిలా ఉంటే `అర్జున్‌రెడ్డి` కాంబినేషన్ రిపీట్ కాబోతోందనే ప్రచారం జరుగుతోంది. `అర్జున్‌రెడ్డి` చిత్రాన్ని హిందీలో `కబీర్‌సింగ్` పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్‌హిట్ అందుకున్నాడు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా.
ఇప్పుడు విజయ్‌తో ఓ ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. `ఫైటర్` చిత్రంతో హిందీలో హీరోగా పరిచయం కానున్న విజయ్ ఈ సినిమా తర్వాత అక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే సందీప్‌రెడ్డికి అక్కడ మార్కెట్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరోసారి తమ కాంబినేషన్‌ని రిపీట్ చెయ్యాలని భావిస్తున్నాడు సందీప్‌రెడ్డి. అయితే బాలీవుడ్లో రణబీర్‌కపూర్‌తో ఓ సినిమా ప్లానింగ్‌లో ఉంది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఆ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అది పూర్తయిన తర్వాత విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. `అర్జున్‌రెడ్డి`కి డిఫరెంట్ జోనర్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్న సందీప్ ఈసారి విజయ్‌తో మరో డిఫరెంట్ సబ్జెక్ట్ ట్రై చెయ్యబోతున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా దేశంలోని పలు భాషల్లో ఈ సినిమా విడుదల చెయ్యాలన్నది సందీప్ ప్లాన్.













