భారీ ప్లానింగ్ తో విజయ్ డైరెక్టర్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ సినిమా ఫ్యామిలీ స్టార్ ఎన్నో అంచనాలతో రిలీజై దారుణమైన పరాజయాన్ని పొందింది. తనకు ఆల్రెడీ గీతా గోవిందం లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో పరశురామ్ మీద నమ్మకంతో విజయ్ ఈ సినిమాను ఒప్పుకున్నాడు. కానీ పరశురామ్, విజయ్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.
ఫ్యామిలీ స్టార్ తర్వాత గౌతమ్ తిన్ననూరితో సితార బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్న విజయ్ తర్వాతి సినిమాను రవి కిరణ్ కోలా, రాహుల్ సాంకృత్య్సన్ తో చేయనున్నాడు. రాహుల్ తో విజయ్ చేయనున్న సినిమా పీరియాడికల్ కథతో తెరకెక్కనుంది. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది.
ఇప్పటికే రాహుల్ తో కలిసి విజయ్ టాక్సీవాలా సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయాలని చూస్తున్నాడు విజయ్. రాహుల్ ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే విషయంలో భారీ ప్లానింగ్ తో వస్తున్నాడని, ఈ సినిమా విజయ్ కెరీర్లోనే స్పెషల్ గా నిలిచిపోతుందని అంటున్నారు.













