ఆ ఇద్దరిలో ఎవరికి గోల్డెన్ ఛాన్స్
విజయ్ దేవరకొండతో పూరి జగన్నాధ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించే చిత్రానికి ఫైటర్ అనే పేరు ఖరారు చేశారు. టెక్నిషియన్స్‌ను ఎలాగూ పూర్తి పెద్దగా మార్చడు కాబట్టి.. హీరోయిన్స్ ఎవరనే దానిపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. తన హిట్ సినిమాల హీరోయిన్లను రిపీట్ చేయడం పూరికి అలవాటు. ఇడియట్‌తో పరిచయం చేసిన రక్షితను ఆంధ్రావాలా చిత్రంలో తీసుకున్న పూరి… అమ్మానాన్న తమిళ అమ్మాయితో ఇంట్రడ్యూస్ చేసిన అసిన్‌ను నాగార్జున శివమణిలో నటింపజేశాడు. అలాగే పోకిరి తరువాత కోటి రాగాలు పలికిన ఇలియానాను.. దేవుడు చేసిన మనుషులులో తీసుకున్నాడు. అలా తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్‌లో నటించిన నిధి అగర్వాల్, నభా నటేష్లలో కనీసం ఒకరిని.. ఫైటర్‌లో తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరికి విజయ్ దేవరకొండ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ వరిస్తుందనేది ప్రస్తుతం టాలీవుడ్లో టాపిక్‌గా మారింది. నిధి అగర్వాల్, నభా నటేష్ మాత్రం ఛార్మిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని సమాచారం.













