రౌడీ హీరో ప్రతీదీ స్పెషలే!
విజయ్ దేవరకొండ నుంచి ఆఖరిగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అయింది. విజయ్ కు ట్యాక్సీవాలా తర్వాత చెప్పుకోదగ్గ హిట్ వచ్చింది లేదు. ఖుషి సినిమా కూడా యావరేజ్ టాక్ తో గట్టెక్కింది తప్పించి లాభాలను అయితే తీసుకురాలేదు. అయితే విజయ్ సినిమాల ఫలితమెలా ఉన్నా తన ఇమేజ్ మాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం సితార బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12 సినిమా చేస్తున్నాడు విజయ్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతుంది. విజయ్ ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో ఈ సినిమా రిలీజయ్యే ఛాన్సుంది. ఇది సెట్స్ పై ఉండగానే విజయ్, దిల్ రాజు బ్యానర్ లో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమాను అనౌన్స్ చేశాడు.
యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న ఈ సినిమా గోదావరి నేపథ్యంలో ఉండగా, విజయ్ సంభాషణలు కూడా ఆ యాసలోనే ఉంటాయని, ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇక రాహుల్ సాంకృత్యన్ తో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఓ హిస్టారికల్ మూవీని చేయనున్నాడు విజయ్. ఇప్పటివరకు విజయ్ ఎక్కువగా సోషల్ కాన్సెప్ట్స్ లోనే కనిపించాడు. కానీ విజయ్ నుంచి రానున్న నెక్ట్స్ మూడు సినిమాలు పీరియాడిక్ జానర్ లోఉంటూనే వేటికవే స్పెషల్ గా ఉండనున్నాయి. వీటిలో ఏ రెండు క్లిక్ అయినా విజయ్ క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లడం ఖాయం.













